హైదరాబాద్ చైతన్యపురి జంక్షన్ లో రోడ్డుపై భారీ గుంత పడింది. ఎల్బీనగర్ నుంచి దిల్ ఘుఖ్ నగర్ వెళ్లే ప్రధాన రహదారిపై రోడ్డు కుంగింది. దీంతో 3 అడుగుల వెడల్పు, 6 అడుగుల లోతులో గుంత ఏర్పడింది. ఈ గుంత ప్రధాన రహదారిపై ఏర్పడటంతో వాహనదారులకు ఇబ్బంది కలగకుండా గుంత చుట్టూ ట్రాఫిక్ పోలీసులు బారు గేట్లు అడ్డుపెట్టారు. దీంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జాం అవుతుంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ALSO READ: ఇంత కిరాతకం ఏంటీ : టాక్సీ డ్రైవర్ ను 200 మీటర్ల ఈడ్చుకెళ్లారు
ముందే తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఇప్పుడు సమస్యలను ప్రభుత్వం పట్టించుకోదని ప్రజలు వాపోతున్నారు. ఈ సమస్యను ప్రస్తుతం ఎవరు పరిష్కరిస్తారని స్థానికులు చర్చించుకుంటున్నారు.