చైతన్యపురి ప్రజలు ఆందోళన.. హైడ్రా ఎప్పుడు వస్తుందో..

చైతన్యపురి ప్రజలు ఆందోళన.. హైడ్రా ఎప్పుడు వస్తుందో..

మూసీ పరిధిలోని చైతన్య పురి డివిజన్​ పరిధిలో పరిధిలో విద్యుత్ నగర్,ద్వారక పురి,భవాని నగర్ ప్రాంత ప్రజలు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు.  హైడ్రా అధికారులు ఎప్పుడు వచ్చి తమ ఇళ్లను కూలుస్తారోనని భయంతో గడుపుతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం  చేశారు.  తాము ఆక్రమించి ఇల్లు కట్టుకోలేదని.. కూలీ నాలీ చేసుకుని కష్టపడి కొనుక్కొని రిజిష్ట్రేషన్​ ఫీజు చెల్లించి పక్కాగా కొనుకున్నామని చెబుతున్నారు.  ఎప్పుడో కొనుక్కొని నివాసం ఉంటున్నామని .. వాటిని ఇప్పుడు కూలగొడతామంటే ఊరుకోమని ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. 

ALSO READ | హైడ్రా మీద కేసు నమోదు చేయాలి: హరీశ్ రావు

ఎన్నికల సమయంలో ... ఇళ్లు లేని వారికి డబుల్​ బెడ్​రూం ఇళ్లు ఇస్తామని చెప్పి.. అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అయిందని.. కాలనీల్లో ఉండే నిరుపేదలకు డబుల్​ బెడ్​ రూం ఇళ్లు ఇవ్వాలని కాలనీ వాసులు ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు.   తమ ఇండ్లను ప్రభుత్వం కూల్చవద్దని విజ్ఞప్తి చేశారు.