ఈ సంవత్సరం ( 2024) చైత్ర నవరాత్రులు ఏప్రిల్ 9 నుంచి ప్రారంభమవుతాయి. ఇవి ఏప్రిల్ 17న రామ నవమి రోజు ముగుస్తాయి.. ఈ సంవత్సరం చైత్ర నవరాత్రుల్లో ఒక అద్భుతం జరగబోతోంది. 30 ఏళ్ల తర్వాత అమృత సిద్ధి యోగంతో నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. దీంతో దీని ప్రాధాన్యత మరింత పెరిగింది.
ఈ సమయంలో మాతృమూర్తి వివిధ రూపాలను భక్తితో పూజించడం ద్వారా ఆశీర్వాదాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. జీవితంలోని అన్ని కష్టాలను తొలగించి ఆనందం, శ్రేయస్సును కలిగిస్తుందని చెబుతారు. నవరాత్రులు ఏడాదికి 4 సార్లు వస్తాయి. ఈ 9 రోజులు భగవతీ దేవి 9 రూపాలను పూజిస్తారు.చైత్ర నవరాత్రులు, శారదీయ నవరాత్రులు, రెండు గుప్త నవరాత్రులు. నవరాత్రులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని పురాణాలు చెబుతున్నాయి.
అశ్వినీ నక్షత్రం నుంచి చైత్ర నవరాత్రులు ప్రారంభంకానున్నాయి. రాశులలో మొదటి రాశి అశ్వినీ నక్షత్రంగా పరిగణిస్తారు. మంగళవారం అమృతసిద్ధి యోగం కలుగుతుంది. ఇది ఏప్రిల్ 9న సూర్యోదయానికి 2 గంటల ముందు ప్రారంభమవుతుంది. ఈ యోగంలో ఘటస్థాపన చేయడం వల్ల అదృష్టాన్ని పొందుతారు. అకాల మరణం నుంచి కూడా తప్పించుకోవచ్చని పండితులు చెబుతున్నారు.
చైత్ర నవరాత్రి ఘటస్థాపన ముహూర్తం
నవరాత్రుల మొదటి రోజు అంటే ఏప్రిల్ 9వ తేదీ ఉదయం 6.25 నుంచి 10.27 వరకు ఘటస్థాపనకు ఉత్తమ సమయం. అంతే కాకుండా మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.48 గంటల వరకు ప్రారంభమయ్యే అభిజీత్ ముహూర్తంలో కూడా ఘటస్థాపన చేయవచ్చు. ప్రతి సంవత్సరం మాతా రాణి ఏదో వాహనంపై స్వర్గం నుంచి భూలోకానికి వస్తుంటారు. ఈ సంవత్సరం మాత రాణి అశ్వాన్ని ఎక్కి భూలోకానికి రానుంది. ఇది శుభం కాదు. మాత రాణి గుర్రంపై స్వారీ చేయడం వల్ల ప్రకృతి వైపరీత్యాలు సంభవించే అవకాశం ఉందని అంటున్నారు.