తెలంగాణ మలిదశ ఉద్యమానికి స్ఫూర్తి చాకలి ఐలమ్మ

  • కొరిటికల్​లో ఐలమ్మ విగ్రహావిష్కరణ

లక్ష్మణచాంద(మామడ), వెలుగు: తెలంగాణ మలిదశ ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాత వీరనారి చాకలి ఐలమ్మ అని ఆమె మనుమడు చిట్యాల రామచంద్రయ్య, ముని మనుమడు సంపత్, ఐలమ్మ ఉత్సవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు సుంకేట పోశెట్టి అన్నారు. ఆదివారం మామడ మండలం కొరిటికల్ గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ స్ఫూర్తిగా సమసమాజ అభివృద్ధికి కులమతాలకు అతీతంగా అందరూ పాటుపడాలన్నారు. 

భూమి కోసం, భుక్తి కోసం ఎన్నో పోరాటాలు చేసి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన ఘనత చాకలి ఐలమ్మ దేనన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బోజవ్వ, ఎంపీటీసీ సౌజన్య, ఉప సర్పంచ్ శిరీష, నిర్మల్ జిల్లా రజక సంఘం అధ్యక్షుడు శంకర్, జిల్లా ఉపాధ్యక్షుడు సహదేవ్, మామడ మండల అధ్యక్షుడు రాజేశ్వర్, నాయకులు పల్లా రాజేశ్వర్ రజక సంఘం సభ్యులు పాల్గొన్నారు.