చాకలి ఐలమ్మకు నివాళి

చాకలి ఐలమ్మకు నివాళి

కామారెడ్డిటౌన్​, వెలుగు:  బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో  చాకలి ఐలమ్మ వర్ధంతి నిర్వహించారు.  ఆమె ఫొటోకు  ఎస్సీ, ఎస్టీ కమిషన్​ చైర్మన్  వెంకటయ్య,  కలెక్టర్​ ఆశిశ్​సంగ్వాన్​, ఎస్పీ సింధూశర్మ, ఆయా శాఖల ఆఫీసర్లు, సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళ్లులర్పించారు.  మెయిన్​ రోడ్డులోని చాకలి ఐలమ్మ విగ్రహానికి రజక, బీసీ సంఘాల ప్రతినిధులు, మున్సిపల్​చైర్​పర్సన్​ గడ్డం ఇందుప్రియ  పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

లింగంపేట:  లింగంపేట మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ వర్ధంతిని ఆఫీసర్లు, అధికార పార్టీ లీడర్లు మంగళవారం నిర్వహించారు. ఎంపీడీఓ  ఆఫీస్​ ఆవరణలో మండల ప్రత్యేక అధికారి డీఆర్​డీఓ సురేందర్, ఎంపీడీఓ నరేష్, ఏపీఎం శ్రీనివాస్, పవన్​కుమార్​ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.  అలాగే బీసీ హాస్టల్ వద్ద గల ఐలమ్మ విగ్రహానికి​ కాంగ్రెస్​ పార్టీ మండల అధ్యక్షుడు బుర్ర నారాగౌడ్​, మైనారిటీ సెల్​ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఫియొద్దీన్, ఎల్లారెడ్డి ఏఎంసీ వైస్​చైర్మన్​జొన్నల రాజు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.  ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు.  చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి ఉద్యమకారులకు మార్గదర్శకం అన్నారు.

నవీపేట్: తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని మండలంలో ఘనంగా నిర్వహించారు.   నాల్లేశ్వర్ గ్రామస్తులు ఆమె విగ్రహనికి పూలమాలలు వేసి నివాలర్పించారు.  ఈ సందరర్భంగా బినోలా సొసైటీ చైర్మన్ హన్మాండ్లు మాట్లాడుతూ   రజాకార్​లకు ఎదురొడ్డి పోరాడిన వీర వనిత మన ఐలమ్మ అని అన్నారు. ఆమె స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు.   

ధర్పల్లి : ధర్పల్లి మండల కేంద్రంలో మంగళవారం చాకలి ఐలమ్మ వర్ధంతి  ఘనంగా నిర్వహించారు.  పలువురు నాయకులు ఆమె విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు.   కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆర్మూర్​ చిన్నబాల్​రాజ్, కాంగ్రెస్​ నాయకులు చిన్నారెడ్డి, చెలిమెల శ్రీనివాస్, చెలిమెల నర్సయ్య, సురేందర్​గౌడ్, రజక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.  

బాల్కొండ : చిట్యాల చాకలి ఐలమ్మ తెలంగాణ స్ఫూర్తి ప్రదాత అని మలి దశ ఉద్యమ కారుడు బుల్లెట్ రాంరెడ్డి అన్నారు. ముప్కాల్ మండలంలోని రెంజర్ల లో రజక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.   

ఆర్మూర్ : ఆర్మూర్ లో మంగళవారం రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 39 వర్ధంతిని నిర్వహించారు. దోభీఘాట్ చౌరస్తాలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి మున్సిపల్​ చైర్​ పర్సన్​ వన్నెల్​ దేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్, వైస్​ చైర్మన్​ షేక్​ మున్ను పూలమాలలు వేసి నివాళులర్పించారు.