చల్మెడలో చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ

చల్మెడలో చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ

నిజాంపేట, వెలుగు: భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన వీర వనిత చాకలి ఐలమ్మ అని రజక సంఘం జిల్లా అధ్యక్షుడు స్వామి అన్నారు. మండల పరిధిలోని చల్మెడ గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని గురువారం మాజీ సర్పంచ్ నరసింహ రెడ్డి, జిల్లా రజక సంఘం అధ్యక్షుడు స్వామితో కలసి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ.. భూ పెత్తందారులకు, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఐలమ్మ ఫ్యామిలీని ఎన్ని చిత్ర హింసలు పెట్టిన ఎత్తిన జెండా దించని వీర వనిత ఐలమ్మ అని కొనియాడారు.

గత గవర్నమెంట్ ఆమె చరిత్రను గుర్తించి పాఠ్య పుస్తకాల్లో చేర్చిందని. ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ మహిళ యూనివర్సిటీకి ఐలమ్మ పెరు పెట్టిందని గుర్తు చేశారు. రజకులు బట్టలుఉతికే సమయంలో ప్రమాదవశాత్తు నీటిలో పడి మరణిస్తే వారికి గవర్నమెంట్ రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ బాల్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ రమేశ్, రాజు, రజక సంఘ సభ్యులు పాల్గొన్నారు