దిగబడిన లారీని తొలగించరా: చాక్నావాడిలో కుంగిన నాలా వద్ద స్థానికుల ఆందోళన

బషీర్ బాగ్, వెలుగు: గోషామహల్ నియోజకవర్గం చాక్నావాడిలో కుంగిన నాలా వద్ద శనివారం స్థానికులు ఆందోళనకు దిగారు. శుక్రవారం తెల్లవారుజామున నాలా కుంగి అందులో పడిపోయిన లారీని తొలగించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగి 24 గంటలు దాటినా జీహెచ్ఎంసీ అధికారులు స్పందించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు.

సంక్రాంతి సెలవుల నేపథ్యంలో పిల్లలంతా ఇండ్ల వద్దే ఉంటున్నారని, ఆడుకుంటూ వెళ్లి నాలాలో పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఇరుక్కుపోయిన లారీ తొలగించి, రోడ్డును బారికేడ్లతో క్లోజ్​చేయాలని కోరారు. ఇదే నాలా ఇప్పటివరకు నాలుగు సార్లు కుంగిందని, రోడ్డు మొత్తాన్ని తిరిగి నిర్మించాలని డిమాండ్​చేశారు. లేనిపక్షంలో జీహెచ్ఎంసీ హెడ్డాఫీసును ముట్టడిస్తామని హెచ్చరించారు.  స్థానికులు ఆనంద్ కుమార్ గౌడ్, ప్రియ గుప్తా తదితరులు పాల్గొన్నారు.