30 ఏళ్లుగా మునుగోడు నిర్లక్ష్యానికి గురైంది : చలమల్ల కృష్ణారెడ్డి 

చౌటుప్పల్, వెలుగు: గత 30 ఏళ్లుగా మునుగోడు నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబాటుకు గురైందని  బీజేపీ అభ్యర్థి చలమల్ల కృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం చౌటుప్పల్ మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటివరకు మునుగోడులో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు అధికారం ఇచ్చారని, ఈసారి బీజేపీకి అధికారమిస్తే ఈ ప్రాంత బిడ్డగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

ప్రజలందరూ కూడా పార్టీలకతీతంగా తనకు మద్దతు తెలుపుతున్నారన్నారు.  అమిత్ షా రోడ్ షోతో  కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగిందన్నారు.  మోడీ పాలనలో పేదలకు  సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు.  కార్యక్రమంలో  పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు రమణ గోని శంకర్,  దూడల బిక్షం, ఊడుగు  వెంకటేశ్, బిక్ష్మమాచారి పాల్గొన్నారు.