చౌటుప్పల్, వెలుగు: బీజేపీతోనే గిరిజన తండాల అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ మునుగోడు అభ్యర్థి చలమల్ల కృష్ణారెడ్డి చెప్పారు. ఆదివారం సంస్థాన్ నారాయణపురం మండలం రాచకొండ తండా, కడిలబాయి తండా, వాచ్య తండాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ విచ్చలవిడిగా అప్పులు చేసి ప్రభుత్వ ఖజానా ఖాళీ చేశారని విమర్శించారు.
బీజేపీకి అధికారం ఇస్తే అన్ని తండాలకు సాగు, తాగునీరు అందిస్తామని చెప్పారు. ప్రతి మండలంలో గిరిజన విద్యాలయాన్ని ఏర్పాటు చేసి గిరిజనులకు నాణ్యమైన విద్యను అందిస్తామని హామీ ఇచ్చారు. నారాయణపురం మండల బిడ్డగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడతానని ప్రకటించారు. బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు.