గరిడేపల్లి ఎస్ఐగా నరేశ్

గరిడేపల్లి, వెలుగు : సూర్యాపేట జిల్లా గరిడేపల్లి ఎస్ఐ గా చలికంటి నరేశ్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న సైదులును వీఆర్ కు అటాచ్ చేశారు. ఎస్ఐ–2 ఉన్న నరేశ్ కు ఎస్ఐ గా పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు. పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు.