ఈడీ ముందుకు బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ నేత చలిమెడ

  • మెడికల్ కాలేజీ సీట్ల బ్లాకింగ్‌‌‌‌ కేసులో ఎంక్వైరీకి హాజరు 

 హైదరాబాద్‌‌‌‌, వెలుగు : మెడికల్‌‌‌‌ పీజీ సీట్ల బ్లాకింగ్‌‌‌‌ కేసులో ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్‌‌‌‌ డైరెక్టరేట్‌‌‌‌(ఈడీ) దర్యాప్తు కొనసాగుతోంది. ఇందులో భాగంగా చలిమెడ ఆనందరావు ఇన్‌‌‌‌ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చైర్మన్ చలిమెడ లక్ష్మీనరసింహారావును శుక్రవారం ఈడీ అధికారులు విచారించారు. రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సీట్లను బ్లాక్ చేసి మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌, కన్వీనర్‌‌‌‌‌‌‌‌, ఎన్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఐ కోటా కింద విక్రయిస్తున్నారని గతేడాది ఫిబ్రవరిలో ఈడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్‌‌‌‌ కింద 10 మెడికల్‌‌‌‌ కాలేజీల్లో గతేడాది సోదాలు చేసింది. 

స్వాధీనం చేసుకున్న రికార్డుల ఆధారంగా ఆయా మెడికల్ కాలేజీల సిబ్బంది, యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నది. ఇప్పటికే ఈ కేసులో మల్లారెడ్డి మెడికల్ కాలేజీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సురేందర్ రెడ్డి స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌ను గురువారం రికార్డ్‌‌‌‌ చేశారు. ఈ క్రమంలోనే మెడికల్‌‌‌‌ సీట్ల కేటాయింపులో అక్రమాలకు పాల్పడిన మెడికల్ కాలేజీల ఏఓలు, ఎండీలు, చైర్మన్లను ప్రశ్నిస్తున్నారు. 

గతంలో చలిమెడ లక్ష్మీనరసింహారావు కాలేజీ సిబ్బంది ఇచ్చిన స్టేట్‌‌‌‌మెంట్స్‌‌‌‌ ఆధారంగా ఆయనను ప్రశ్నించినట్టు తెలిసింది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నుంచి బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ ఎమ్మెల్యేగా అభ్యర్థిగా లక్ష్మీనర్సింహారావు పోటీ చేశారు.