ఎస్‌బీఐ కొత్త ఛైర్మన్‌గా చల్లా శ్రీనివాసులు

ఎస్‌బీఐ కొత్త ఛైర్మన్‌గా చల్లా శ్రీనివాసులు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ఛైర్మన్‌గా చల్లా శ్రీనివాసులు శెట్టి పేరును కేంద్రం ప్రతిపాదించింది. ఎస్‌బీఐలోని మరో ఇద్దరు ఎండీలు అశ్వినీ కుమార్ తివారీ, వినయ్ టోన్స్ పేర్లనూ పరిశీలించిన కేంద్రం చివరికి శెట్టిని ఖరారు చేసింది. ఆగస్టు 28న పదవీ విరమణ పొందనున్న ప్రస్తుత ఛైర్మన్ దినేశ్ ఖరా స్థానాన్ని శ్రీనివాసులు భర్తీ చేయనున్నారు. కాగా శ్రీనివాసులు శెట్టికి ఎస్‌బీఐ లో 36ఏళ్లు పనిచేసిన అనుభవం ఉంది. ఈయన ప్రస్తుతం   ఎస్‌బీఐ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు, అంతర్జాతీయ బ్యాంకింగ్, గ్లోబల్ మార్కెట్స్ మరియు టెక్నాలజీ వర్టికల్స్‌ను చూస్తున్నారు.

శ్రీనివాసులు శెట్టి 1988లో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా ఎస్‌బీఐలో చేరారు. 2020లో ఎస్‌బీఐ బోర్డులో ఎండీగా నియమితులయ్యారు. ప్రస్తుతం అంతర్జాతీయ బ్యాంక్‌, గ్లోబల్‌ మార్కెట్స్‌ అండ్‌ టెక్నాలజీ వింగ్స్‌ బాధ్యతలు చూస్తున్నారు. కార్పొరేట్ క్రెడిట్, రిటైల్, డిజిటల్, ఇంటర్నేషనల్‌ బ్యాంకింగ్‌లో విశేష అనుభవం ఉంది. అయితే ఎఫ్‌ఎస్‌ఐబీ సిఫార్సు తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని క్యాబినెట్‌ నియామకాల కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుంది.