ఉదండాపూర్​ నిర్వాసితులకు న్యాయం చేస్తాం : చల్లా వంశీచంద్​రెడ్డి

ఉదండాపూర్​ నిర్వాసితులకు న్యాయం చేస్తాం : చల్లా వంశీచంద్​రెడ్డి

నవాబుపేట, వెలుగు: ఉదండాపూర్​ రిజర్వాయర్​లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు కాంగ్రెస్​ ప్రభుత్వం న్యాయం చేస్తుందని సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు చల్లా వంశీచంద్​రెడ్డి తెలిపారు. శుక్రవారం మండలంలోని పర్వాతాపూర్​ మైసమ్మ ఆలయంలో పూజలు నిర్వహించి పాలమూరు న్యాయయాత్రను ప్రారంభించారు. కాకర్లపహాడ్, రుద్రారం, నవాబుపేట గ్రామాల్లో స్థానికులు స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్నర్​ మీటింగ్​లో ఆయన మాట్లాడుతూ ఉదండాపూర్​ రిజర్వాయర్​ పనులను పూర్తి చేసి రైతులకు సాగునీరందిస్తామన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను త్వరలోనే అమలు చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే అనిరుధ్​రెడ్డి ఆధ్వర్యంలో గ్రామాల డెవలప్​మెంట్​ వేగవంతం చేస్తామన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్​ సర్కారును తరిమికొట్టినట్లుగానే, కేంద్రంలో బీజేపీని సాగనంపి రాహుల్​గాంధీని ప్రధానిగా చేయాలని కోరారు.

నిరుపేద జనాల కోసం పనిచేసే కాంగ్రెస్​ పార్టీకి జనాలు మద్దతుగా నిలవాలని కోరారు. జనంపల్లి దుశ్యంత్​రెడ్డి, ఖాజామహేక్, పీసీసీ స్పోక్స్​పర్సన్​ జహీర్​అఖ్తర్, నీరటి రాంచంద్రయ్య, బంగ్లరవి, హమీద్​మహేక్, తుల్సీరాం నాయక్, జలాలోద్దీన్​ బాబర్, నర్సింహాచారి, కొల్లూరు ఖాజా, మల్లేశ్​యాదవ్, జగన్మోహన్​రెడ్డి, రాజు, కొల్లి నర్పింహా, చిర్ప సత్యం పాల్గొన్నారు.