- సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్‌రెడ్డి
జడ్చర్ల టౌన్, వెలుగు: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేసి రాహుల్‌గాంధీని ప్రధానిని చేసుకుందామని సీడబ్ల్యూసీ ఆహ్వానితుడు చల్లా వంశీచంద్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం జడ్చర్లలోని చంద్రా గార్డెన్స్‌లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాల్లో 12 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారన్నారు.
ప్రజా తీర్పుకు అనుగుణంగా ప్రజాపాలన సాగిస్తుందన్నామని, దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా సీఎం రేవంత్‌రెడ్డి కష్టపడి పని చేస్తున్నారన్నారు. పాలమూరు బిడ్డను సీఎం కుర్చీలో కూర్చోబెట్టిన అధిష్టానానికి, సీఎం ఇన్చార్జిగా ఉన్న పాలమూరు ఎంపీ స్థానాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి బహుమతిగా ఇవ్వాలని కోరారు. రాహుల్‌గాంధీని ప్రధానిని చేసుకోవాల్సిన భాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పై ఉందన్నారు. ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి నియోజకవర్గ అబివృద్ది కోసం ఎంతో తపన పడుతున్నారని, సీఎంను కలిసి రింగ్‌రోడ్డుతోపాటు జడ్చర్లను ఇండస్ట్రియల్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా పాలన నిర్వహిస్తే అందులో ఎక్కువగా భూ కబ్జా పిర్యాదులే వచ్చాయని చెప్పారు. భూములు, పొలాలు కబ్జా చేసి బిల్డింగులు నిర్మించుకున్నారని, వీటిపై విచారణ చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. త్వరలో బీఆర్ఎస్ నేతల అవినీతి చిట్టాను బయటపెడతానన్నారు. ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి, జీఎమ్మార్, కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డిపాల్గొన్నారు.