పెద్దపల్లి జిల్లా చిల్లపల్లి గ్రామ పంచాయతీకి జాతీయ అవార్డు.. ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ విభాగంలో ఎంపిక

  • ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ విభాగంలో ఎంపిక

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో పెద్దపల్లి జిల్లా చిల్లపల్లి గ్రామ పంచాయతీకి జాతీయ అవార్డు దక్కింది. విమెన్ ఫ్రెండ్లీ పంచాయతీ విభాగంలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ (డీడీయూపీఎస్వీపీ)కు ఎంపికైంది. బుధవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన జాతీయ పంచాయతీ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వివిధ కేటగిరీ  ల్లో ఎంపికైన పంచాయతీలకు అవార్డు లు అందజేశారు. 

Also Read : ఉపాధి పొందిన దివ్యాంగులు..మార్గదర్శులుగా నిలవాలి 

దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో మొత్తం 45 గ్రామ పంచాయతీలు ఈ అవార్డులను అందుకున్నాయి. ఇందులో డీడీయూ పీఎస్వీపీ కింద అందజేసిన 27 అవార్డుల కు కేంద్ర ప్రభుత్వం రూ.20.25 కోట్లు కేటాయించింది. ఈ ప్రైజ్ మనీలో చిల్లపల్లి గ్రామ పంచాయితీకి రూ.75 లక్షలు దక్కాయి.