బీఆర్ఎస్‌‌‌‌తోనే అన్ని వర్గాలకు న్యాయం : చల్మెడ లక్ష్మీనరసింహారావు

  •     చల్మెడ లక్ష్మీనరసింహా రావు 

వేములవాడ, వెలుగు : బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆ పార్టీ వేములవాడ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు అన్నారు.  ఆదివారం వేములవాడలోని ముదిరాజ్, సుతారి, మోచీ,  పూసల సంఘం, శ్రీ రాజరాజేశ్వర కార్పెంటర్స్ సేవ్స్ సొసైటీ  ఆధ్వర్యంలో వేర్వేరుగా నిర్వహించిన సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి 

ప్రజల సంక్షేమమే లక్ష్యంగా బరిలో నిలుస్తున్నానని, ఒక్కసారి అవకాశం ఇచ్చి ఆశీర్వదిస్తే వేములవాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌ రామతీర్థపు మాధవి-, పట్టణ అధ్యక్షుడు పుల్కం రాజు,  కౌన్సిలర్లు విజయ్, అజయ్,  మహేశ్‌‌‌‌, కుమార్,  మధు, శంకర్,  లక్ష్మీరాజం, శ్రీనివాస్ పాల్గొన్నారు.