బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌తోనే  కుల సంఘాలు బలోపేతం  : లక్ష్మీనరసింహరావు

వేములవాడ, వెలుగు : బీఆర్ఎస్​ప్రభుత్వంతోనే రాష్ట్రంలో కులసంఘాలు బలోపేతమయ్యాయని,  కులసంఘాల అభివృద్దే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని ఆ పార్టీ వేములవాడ నియోజకవర్గ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహా రావు అన్నారు. శుక్రవారం వేములవాడలోని సంగీత నిలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌‌‌‌‌‌‌‌బాబుతో కలసి వివిధ కుల సంఘాలకు స్థల కేటాయింపు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా చల్మెడ  మాట్లాడుతూ నియోజకవర్గం అన్ని  రంగాల్లో అభివృద్ధి చెందడంలో మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ రాజేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు,

ప్రస్తుత ఎమ్మెల్యే రమేశ్‌‌‌‌‌‌‌‌బాబు  కృషి ఎంతో ఉందన్నారు.  మెట్ట ప్రాంతమైన వేములవాడకు ఎత్తిపోతల పథకంతో సాగునీరు అందించారన్నారు.  అనంతరం వేములవాడ అర్బన్​మండలం చీర్లవంచ స్కూల్‌‌‌‌‌‌‌‌లో సీఎం బ్రేక్​ఫాస్ట్​పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మ్యాకల రవి, సెస్ డైరెక్టర్ హరిచరణ్ రావు పాల్గొన్నారు.