![ఢిల్లీకి లక్షల మంది రైతుల ట్రాక్టర్ల యాత్ర](https://static.v6velugu.com/uploads/2024/02/chalo-delhi-farmers-protest-rally_XLyDOhbSMJ.jpg)
దేశ వ్యాప్తంగా ఉన్న 200 రైతు సంఘాలు ఫిబ్రవరి 13న ఛలో ఢిల్లీ పాదయాత్రకు తరలిరావాలని యూనియన్ కిసాన్ మోర్చా నేత జగ్జిత్ సింగ్ దల్లేవాల్ పిలుపు నిచ్చారు. ఈ మేరకు రైతు సంఘాలు చిల్లా పరిసర ప్రాంతాలు, నోయిడా నుంచి ఢిల్లీకి ర్యాలీగా బయల్దేరారు. ఎలాంటి హింసాత్మక ఘటనలు, అల్లర్లు జరగకుండా హిమాచల్ ప్రదేశ్ పోలీసులు పటిష్ట భద్రతలు తీసుకుంటున్నారు.
కనీస మద్దతు ధర చట్టం, వ్యవసాయ కార్మికులకు పెన్షన్లు, రైతు సంఘాల ప్రాథమిక డిమాండ్లను నిరవేర్చాలని కోరుతూ యమునానగర్, పంచుకులా, హిమాచల్ ప్రదేశ్ లోని శుంభు, ఖానౌరీ, దబ్వాలి ప్రదేశాల్లో నిరసన ర్యాలీలు చేస్తున్నారు.
ఈ ర్యాలీలో హింస చలరేగకుండా ప్రభుత్వ బలగాలు మోహరించాయి. రైతు రుణ మాఫి, లఖింపూర్ ఖేరీ హింసాఖాండ బాధితులకు న్యాయం చేయాలని, స్వామి నాథన్ కమిషన్ సిఫార్సుల అమలు వంటి సమస్యలపై యూనియన్ కిసాన్ మోర్చా ఛలో ఢిల్లీ పాదయాత్ర చేపట్టింది. ఫిబ్రవరి 13న రైతులు ఢిల్లీకి చేరుకొన్నున్నారు.