ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ చలో మహబూబ్ నగర్

కొల్లాపూర్, వెలుగు: ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ బుధవారం మాలల చైతన్య సమితి ఆధ్వర్యంలో చలో మహబూబ్​నగర్​ కార్యక్రమాన్ని చేపట్టారు. సంఘం ఎనిమిదో వార్షికోత్సవంలో భాగంగా పట్టణంలోని అంబేద్కర్​ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాలల చైతన్య సమితి స్టేట్​ వర్కింగ్  ప్రెసిడెంట్ మద్దెల రామదాసు, తాలూకా గౌరవాధ్యక్షుడు వెంకటస్వామి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ‘హలో మాల, చలో మహబూబ్ నగర్’ నిరసన కార్యక్రమం చేపట్టామని తెలిపారు.

 ఎస్సీ వర్గీకరణ పేరుతో మాల, మాదిగల మధ్య చిచ్చు పెడుతున్నారని విమర్శించారు. బీజేపీ మాదిగలకు సపోర్ట్  చేస్తూ వర్గీకరణ చేస్తానని హామీ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. వచ్చే పార్లమెంట్​ ఎన్నికల్లో వర్గీకరణకు సపోర్ట్  చేసే పార్టీలను ఓడిస్తామని హెచ్చరించారు. మారడి కురుమయ్య, బిజ్జ సురేందర్, ఎర్ర శ్రీనివాసులు పాల్గొన్నారు.