భారీ వర్షం.. యాదాద్రి ఆలయంలో కొట్టుకుపోయిన చలువపందిళ్లు, రేకుల షెడ్డు

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ సన్నిధిలో సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ  వర్షం కురిసింది. దీంతో ఎండలనుంచి భక్తులు ఉపశపనం పొందేందుకు ఆలయ సన్నిధిలో ఏర్పాటు చేసిన  చలువపందిళ్లు, రేకుల షెడ్డు ఈదురు గాలులకు నెలమట్టం అయ్యాయి. దీంతో  పక్కనే  పార్కింగ్ చేసిన బైకులు స్వల్పంగా డ్యామేజ్ అయ్యాయి.  భారీ వర్షం కురిసినప్పటికీ తడుస్తూనే స్వామివారిని  భక్తులు దర్శించుకున్నారు. 

యాదగిరిగుట్టతో పాటుగా తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడ్డాయి.  మరోవైపు రాష్ట్రంలో రానున్న ఐదు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.  దాదాపు అన్ని జిల్లాల్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ.. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను జారీ చేసింది. ఆ తర్వాత మూడు రోజులు కూడా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.