
జనగామ అర్బన్, వెలుగు: భువనగిరి కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్కుమార్ రెడ్డి జనగామ జిల్లా కాంగ్రెస్ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ని సోమవారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా కొమ్మూరి మాట్లాడుతూ భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో తన సంపూర్ణ మద్దతు ఉంటుందని, భువనగిరి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమన్నారు. కార్యకర్తలు, నాయకులు సైనికుల్లా పనిచేసి కిరణ్కుమార్ రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.