ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసిన చామల కిరణ్ కుమార్ రెడ్డి

నకిరేకల్, వెలుగు : నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి కలిశారు. సోమవారం పట్టణంలోని ఎమ్మెల్యే నివాసానికి కిరణ్ కుమార్ రెడ్డి వెళ్లి  ధన్యవాదాలు తెలిపారు.

తన గెలుపు కోసం సంపూర్ణ సహకారం అందించాలని కిరణ్​కుమార్​రెడ్డి కోరారు. అనంతరం చామలను ఎమ్మెల్యే సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా నాయకులు చామల శ్రీనివాస్, నాయకులు పాల్గొన్నారు.