సీఎం రేవంత్ రోజూ 18 గంటలు కష్టపడుతున్నరు : చామల కిరణ్

సీఎం రేవంత్  రోజూ 18 గంటలు కష్టపడుతున్నరు : చామల కిరణ్

హైదరాబాద్, వెలుగు: ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి సీఎం రేవంత్​ రెడ్డి రోజూ 18 గంటలు కష్టపడుతున్నారని, అన్ని శాఖలను రివ్యూ చేస్తున్నారని పీసీసీ వైస్​ ప్రెసిడెంట్​చామల కిరణ్ కుమార్​రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 5 రోజుల్లోనే పని మొదలుపెట్టారన్నారు. మంత్రులు కూడా తమ శాఖలను రివ్యూ చేస్తున్నారని పేర్కొన్నారు. బుధవారం ఆయన  గాంధీ భవన్​లో మీడియాతో మాట్లాడారు. 

ఆరు గ్యారంటీలను వీలైనంత త్వరగా అమలు చేసేందుకు పనిచేస్తున్నారన్నారు. బీఆర్​ఎస్​ ప్రభుత్వం అన్నీ అప్పులే చేసిందని,  కానీ, కేటీఆర్​ మాత్రం ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని విమర్శించారు. బీఆర్​ఎస్​ హయాంలో జరిగిన అవినీతిని వెలికితీస్తామన్నారు.  బీఆర్‌‌ఎస్ చేసిన అప్పులు, ప్రభుత్వాన్ని నడిపిన తీరును ప్రజలకు వివరిస్తామన్నారు.