సూర్యాపేట, వెలుగు : పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. భువనగిరి ఎంపీ టికెట్ దక్కడంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని శుక్రవారం ఆయన కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం ఉమ్మడి నల్గొండ జిల్లా అగ్రనాయకులు మాజీ మంత్రి జానారెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితోపాటు పార్టీ పెద్దలను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భగా కిరణ్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించేందుకు కార్యకర్తలు కృషిచేయాలని కోరారు. పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రచార వ్యూహాలు రూపొందించాలని, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రచారం చేయాలని సూచించారు.