Cricket World Cup 2023: శ్రీలంకకు గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ స్క్వాడ్‪లో సీనియర్ ప్లేయర్లు ఎంట్రీ

Cricket World Cup 2023: శ్రీలంకకు గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ స్క్వాడ్‪లో సీనియర్ ప్లేయర్లు ఎంట్రీ

వరల్డ్ కప్ 2023 లో శ్రీలంక పరిస్థితి అద్వానంగా తయారైంది. ఇప్పటివరకు అన్ని జట్లు మూడేసి మ్యాచులు ఆడేయగా ఒక్క శ్రీలంక మినహా మిగిలిన జట్లన్నీ బోణీ కొట్టేశాయి. శ్రీలంక కన్నా బలహీనంగా ఉన్న బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, నెదర్లాండ్స్ జట్లు సైతం తొలి గెలుపును రుచి చూసారు. ఈ నేపథ్యంలో శ్రీలంక జట్టులో ఇద్దరు స్టార్ ప్లేయర్లు లంక జట్టులో చేరనున్నారు. 

ప్రస్తుతం గాయాలతో సతమతమవుతున్న లంక జట్టులో స్టార్ ఆల్ రౌండర్ ఏంజెలో  మాథ్యూస్, దుష్మంత చమీర చేరతారని శ్రీలంక క్రికెట్ ప్రకటించింది. గాయం నుంచి కోలుకున్న చమీర తిరిగి జట్టులోకి చేరగా.. ఆల్ రౌండర్ మాథ్యూస్ సేవలను శ్రీలంక వాడుకోవాలని చూస్తుంది. దీంతో వీరిద్దరిని ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపిక చేసింది. ఒక్క విజయం కూడా సాధించని లంకకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

లంక వరుస పరాజయాలకు ప్లేయర్ల గాయాలే ప్రధాన కారణం. వరల్డ్ కప్ కు ముందే స్టార్ ప్లేయర్ హసారంగా గాయపడగా.. చమీర గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. ఇక కెప్టెన్ శనక మధ్యలోనే వైదొలగడంతో ఆ జట్టు పరిస్థితి మరి దారుణంగా తయారైంది. ఇక తాజాగా యువ పేసర్ పతిరానా కూడా గాయపడడం ఆ జట్టుని బాగా దెబ్బ తీసింది. మొత్తానికి సీనియర్ ప్లేయర్లతోనైనా లంక తొలి విజయాన్ని నమోదు చేసుకుంటుందేమో చూడాలి.