DC vs KKR: క్యాచ్ ఆఫ్ ది టోర్నమెంట్: చమీర డైవింగ్ క్యాచ్ అదుర్స్.. మెండీస్ అనుకుంటే అంతకు మించి

DC vs KKR: క్యాచ్ ఆఫ్ ది టోర్నమెంట్: చమీర డైవింగ్ క్యాచ్ అదుర్స్.. మెండీస్ అనుకుంటే అంతకు మించి

ఐపీఎల్ 2025 లో స్టన్నింగ్ క్యాచ్ నమోదయింది. మంగళవారం (ఏప్రిల్ 29) కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డర్ దుష్మంత చమీర అత్యద్భుతమైన క్యాచ్ తీసుకొని ఔరా అనిపించాడు. స్టార్క్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. 20 ఓవర్ నాలుగో బంతిని స్టార్క్ లెగ్ సైడ్ దిశగా వేశాడు. ఈ బంతిని బ్యాటర్ అనుకుల్ రాయ్ అద్భుతంగా ఫ్లిక్ చేశాడు. డీప్ బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్ వైపు బౌండరీ ఖాయమన్న దశలో చమీర సూపర్ మ్యాన్ తరహాలో క్యాచ్ అందుకున్నాడు. 

లెఫ్ట్ సైడ్ ఫుల్ లెంగ్త్ డైవ్ చేసి క్యాచ్ అందుకోవడం విశేషం. చమీర పట్టిన ఈ అద్భుతమైన విన్యాసం సోషల్ మీడియాలో నెటిజన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. కామెంటేటర్లు కూడా ఇది "క్యాచ్ ఆఫ్ ది టోర్నమెంట్" అని కితాబులిచ్చారు. స్టార్క్, రాహుల్ సైతం చమీర పట్టిన క్యాచ్ కు ఫిదా అయ్యారు. ఈ సీజన్ లో ఇదే తరహాలో కామిందు మెండీస్ క్యాచ్ తీసుకున్నాడు. అయితే చమీర పట్టిన క్యాచ్ మాత్రం అంతకు మించి అనే విధంగా ఉంది. స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నా బౌలింగ్ లో చమీర ఘోరంగా విఫలమయ్యాడు. మూడు ఓవర్లలో 46 పరుగులు సమర్పించుకొని రఘువంశీ వికెట్ తీసుకున్నాడు. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ లో రెచ్చిపోయి ఆడింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో వచ్చినవారు వచ్చినట్టు బ్యాట్ ఝుళిపించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 204 పరుగుల భారీ స్కోర్ చేసింది. 44 పరుగులు చేసిన అంగ్క్రిష్ రఘువంశీ టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్, విప్రజ్ నిగమ్,స్టార్క్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. చమీరాకు ఒక వికెట్ దక్కింది