జార్ఖండ్ సీఎం చంపై సోరేన్ రాజీనామా

జార్ఖండ్ సీఎం చంపై సోరేన్ రాజీనామా

జార్ఖండ్ సీఎం చంపై సోరేన్ రాజీనామా చేశారు. బుధవారం (జూలై 3) తన రాజీనామా లేఖను గవర్నర్ కు సమర్పించారు. జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) ప్రెసిడెండ్ హేమంత్ సోరేన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు రావడంతో చంపై సోరేన్ రాజీనామా చేశారు. రాంచీలోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌కు జార్ఖండ్‌ సీఎం చంపై సోరెన్‌ రాజీనామా సమర్పించారు. 

బుధవారం (జూలై3) మధ్యాహ్నం రాంచీలోని మాజీ సీఎం హేమంత్ సోరేన్ నివాసంలో ఇండియా బ్లాక్ ఎమ్మెల్యేల అఖిల పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జార్ఖండ్ సీఎం గా తిరిగి బాధ్యతలు చేపట్టేందుకు హేమంత్ సోరేన్ ను ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జార్ఖండ్ సీఎం పదవికి చంపై సోరేన్ రాజీనామా చేశారు.  హేమంత్ సోరేన్ జార్ఖండ్ సీఎం గా మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు.