
హైదరాబాద్, వెలుగు: ఇండియా అండర్19 వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ క్రికెటర్ జి. త్రిష (3/18; 44) ఆల్‌రౌండ్ షోతో సత్తా చాటడంతో నెక్ట్స్ జెన్ విమెన్స్ టీ20 ట్రోఫీలో సెంటర్ ఫర్ క్రికెట్ ఎక్స్‌లెన్స్ (సీఎఫ్‌సీ) అకాడమీ జట్టు చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో సీఎఫ్‌సీ 9 వికెట్ల తేడాతో కోచింగ్ బియాండ్ (సీబీ) టీమ్‌ను చిత్తు చేసింది. తొలుత సీబీ టీమ్ 20 ఓవర్లలో 121 రన్స్‌కే ఆలౌటైంది. త్రిష మూడు వికెట్లతో రాణించింది. అనంతరం సీఎఫ్‌సీ 15.5 ఓవర్లలో 122/1 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. ఓపెనర్ రమ్య (72)తో పాటు త్రిష (44) టీమ్‌ను గెలిపించారు. ఈ టోర్నీలో మొత్తంగా 310 రన్స్,11 వికెట్లు తీసిన త్రిషకు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు లభించింది.