
‘మమ్మల్ని తేలిగ్గా తీసుకోవద్దు’, ‘మేం ఏ జట్టునైనా ఓడించగలం’.. అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన బంగ్లాదేశ్ పులులు.. తల కిందకేస్తున్నారు. దుబాయ్ వేదికగా భారత్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ మొదటి 2 ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం బంగ్లా స్కోర్.. 2 ఓవర్లు ముగిసేసరికి 2/2.
Also Read :- మా జట్టు దండగ.. జింబాబ్వే, ఐర్లాండ్‌తో సిరీస్ పెట్టండి
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ కు షమీ మొదటి ఓవర్‌లోనే షాకిచ్చాడు. ఆఖరి బంతికి సౌమ్యా సర్కార్(0)ను పెవిలియన్ చేర్చాడు. ఆ మరుసటి ఓవర్‌లో హర్షిత్ రాణా రెండో వికెట్ పడగొట్టాడు. నాలుగో బంతికి బంగ్లా కెప్టెన్ శాంటో(0) పరుగుల ఖాతా తెరవకుండానే కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో, బంగ్లాదేశ్ 2 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం తంజిత్ హసన్(2*), మెహిదీ హసన్(0) క్రీజులో ఉన్నారు. 200పైచిలుకు పరుగులు చేస్తే తప్ప మ్యాచ్ ఆసక్తికరంగా సాగడం కష్టం.
Double the josh! ?
— CricTracker (@Cricketracker) February 20, 2025
Two wickets in two overs for India ?
?: JioHotstar pic.twitter.com/78xoT2VuQB