దాయాది దేశం ఏ ముహూర్తాన ఆతిథ్య హక్కులు దక్కించుకుందో కానీ, ఛాంపియన్స్ ట్రోఫీని వివాదాలు వీడటం లేదు. హైబ్రిడ్ మోడల్ విధానంతో భారత్, పాకిస్థాన్ మధ్య మొదలైన నెలకొన్న సమస్య ఓ కొలిక్కి వచ్చిందన్న సమయాన.. మరో వివాదం తెరమీదకు వస్తోంది. టోర్నీలో భాగంగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరగనున్న మ్యాచ్‌ను ఇంగ్లాండ్ జట్టు బహిష్కరించనుందని సమాచారం. ఎందుకీ బహిష్కరణ ..? ఈ ఇరు జట్లకు ఏమైంది..? అనేది తెలుసుకుందాం..
మహిళలపై కఠిన ఆంక్షలు
2021లో తాలిబన్ నేతలు తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళలపై అడ్డగోలు ఆంక్షలు విధిస్తున్న విషయం తెలిసిందే. అఫ్ఘాన్ స్కూళ్ళలో చదివే విద్యార్థినులు ఆరవ గ్రేడ్ మించి చదవకూడదన్న నిషేధం, లు ఉద్యోగాలు చేయకుండా ఆంక్షలు, జిమ్‌లలో.. పబ్లిక్ పార్కుల్లో మహిళలు కనిపించడం నిషేధం, మగ తోడులేకుండా ప్రయాణం చేసేవారికి కొరడా దెబ్బలు.. వంటి క్రూరాతిక్రూరమైన నిర్ణయాలతో తాలిబన్లు మృగాల్లా వ్యవహరిస్తున్నారు.
ఇక మహిళల నోట క్రికెట్ అనే మాట వినపడకుండా చేశారు. తమ మాట కాదని మైదానంలో కనిపిస్తే.. ఇంటి పెద్దలను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. ఈ రాక్షస పాలనను UK రాజకీయ నేతలు ఖండిస్తున్నారు. స్త్రీలకు విలువలేనటువంటి తాలిబన్ దేశానికి చెందిన ఒక జట్టు(ఆఫ్ఘనిస్తాన్)తో క్రికెట్ ఆడకూడదని గళమెత్తారు. ఏకంగా 160 మందికి పైగా UK రాజకీయ నాయకులు సంతకం చేసిన లేఖను ఇంగ్లండ్ బోర్డు ఈసీబీ(ECB)కి అందజేశారు.
Also Read : తమిళనాడు వాసి కాదు కాబట్టే జట్టులో ఉన్నాడు
"ఆఫ్ఘన్ మహిళల పట్ల తాలిబన్ ప్రభుత్వం అవలంభిస్తోన్న కఠిన ఆంక్షలను ఖండిస్తూ మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. ఆఫ్ఘనిస్థాన్‌తో జరగబోయే మ్యాచ్‌ను బహిష్కరించాలని మేము ECBని కోరుతున్నాము. మహిళలపై జరుగుతున్న వింతైన దుర్వినియోగాలను సహించబోమని స్పష్టమైన సంకేతం పంపండి. మంచి నిర్ణయం తీసుకొని ఆఫ్ఘన్ మహిళలు, బాలికలకు సంఘీభావం తెలపాలని ECBని వేడుకుంటున్నాం.." అని UK పొలిటిషన్లు ఈసీబీకి రాసిన లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
గతంలోనూ ఓసారి..
ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు మ్యాచ్‌ను బషిష్కరించడం కొత్తేమీ కాదు. గతంలోనూ ఓసారి అలాంటి నిర్ణయం తీసుకుంది. 2003 క్రికెట్ ప్రపంచ కప్‌లో, రాబర్ట్ ముగాబే పాలనకు నిరసనగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌ను ఇంగ్లాండ్ బషిష్కరించింది.