
దాయాదుల పోరుకు క్రేజ్ మాములుగా లేదు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఫిబ్రవరి 23న భారత్ -పాకిస్తాన్ మ్యాచ్ జరగనుండగా.. టికెట్ల కోసం అభిమానులు ఎగబడుతున్నారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) ఫిబ్రవరి 3న తొలిసారి టికెట్లు ఆన్‌లైన్‌లో ఉంచగా.. నిమిషాల్లోనే అమ్ముడయ్యాయి.
ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ఐసీసీ ఆదివారం(ఫిబ్రవరి 16) మరో రౌండ్ అదనపు టికెట్లు అందుబాటులో ఉంచింది. అవీ గంటన్నర వ్యవధిలోనే అమ్ముడైపోయ్యాయి. అధికారిక బుకింగ్ ప్లాట్‌ఫామ్ ప్రకారం, ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటలకు అమ్మకాలు ప్రారంభమవ్వగా.. మధ్యాహ్నం 3 గంటల సమయానికి సోల్డ్ ఔట్ అని చూపించింది. దీన్ని బట్టి ఈ మ్యాచ్‌కు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇరు దేశాల పౌరులు ఎక్కువ సంఖ్యలో దుబాయ్‌లో నివసిస్తున్నందున.. టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి.
స్టేడియం సామర్థ్యం 25 వేలు
భారత్- పాక్ మ్యాచ్ జరగనున్న దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం సామర్థ్యం 25వేలు. టికెట్లు అమ్ముడవుతున్న తీరును బట్టి చూస్తే.. ఇది సరిపోవడం లేదని స్పష్టమవుతోంది. రెండేళ్ల క్రితం(2023) భారత్ ఆతిథ్యమిచ్చిన వన్డే ప్రపంచ కప్‌లో భారత్- పాకిస్థాన్ మ్యాచ్‌కు లక్షా 25 వేల(1,250,307) మంది హాజరయ్యారు. ఇందులో 99.9 శాతం భారత అభిమానులే.
ALSO READ | Yashasvi Jaiswal: జట్టు నుంచి తప్పించారనే బాధ.. రంజీ ట్రోఫీ నుంచి తప్పుకున్న జైస్వాల్