Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఇంగ్లాండ్ ఔట్.. గ్రూప్ బి సెమీస్ లెక్కలు ఇవే

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఇంగ్లాండ్ ఔట్.. గ్రూప్ బి సెమీస్ లెక్కలు ఇవే

ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ బి లో సెమీస్ రేస్ మరింత ఆసక్తికరంగా మారింది. ఆడిన రెండు మ్యాచ్ ల్లో ఇంగ్లాండ్ ఓడిపోవడంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా ఒక్కో విజయం సాధించి సెమీస్ రేసులో ఉన్నాయి. ఈ మూడు జట్లలో రెండు రెండు జట్లు సెమీస్ కు చేరుతాయి. ఏ జట్టు సెమీస్ అవకాశాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

 
సౌతాఫ్రికా:

గ్రూప్ బి లో అందరికంటే సెమీస్ ఫైనల్ అవకాశాలు సౌతాఫ్రికాకు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం సౌతాఫ్రికాఆస్ట్రేలియాతో పాటు 3 పాయింట్లతో సమంగా ఉన్నాయి. నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉండడంతో సౌతాఫ్రికా టాప్ లో ఉంది. నెట్ రన్ రేట్ సఫారీలకు అనుకూలంగా మారనుంది. తొలి మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ పై 107 పరుగుల తేడాతో విజయం సాధించడం కలిసి రానుంది. సౌతాఫ్రికా తమ చివరి ఇంగ్లాండ్ పై శనివారం (మార్చి 1) ఆడనుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే ఎలాంటి సమీకరణాలు లేకుండా సెమీస్ కు చేరవచ్చు. ఒకవేళ ఇంగ్లాండ్ పై ఓడిపోయినా సఫారీలకు ఛాన్స్ ఉంటుంది. చివరి మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ పై ఓడిపోతే నెట్ రన్ రేట్ తేడాతో సౌతాఫ్రికా సెమీస్ కు చేరుతుంది. 

ఆస్ట్రేలియా:

సౌతాఫ్రికా వలె ఆస్ట్రేలియా అవకాశాలు దాదాపు ఒకేలా ఉన్నాయి. ఒక మ్యాచ్ గెలుపు.. ఒక మ్యాచ్ రద్దు కావడంతో మూడు పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది.  కాకపోతే సౌతాఫ్రికాతో పోలిస్తే ఆసీస్ జట్టుకు నెట్ రన్ రేట్ పెద్దగా లేకపోవడం కొంచెం మైనస్ గా మారింది. ఆస్ట్రేలియా తమ చివరి మ్యాచ్ శుక్రవారం (ఫిబ్రవరి 28) ఆఫ్ఘనిస్తాన్ పై ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే సెమీస్ కు చేరుతుంది. ఒకవేళ ఓడిపోతే మాత్రం సెమీస్ కు చేరడం కష్టం. చివరి మ్యాచ్ లో ఓడిపోయినా ఆస్ట్రేలియా ఓడిపోయినా సెమీస్ కు చేరాలంటే ఒకటే మార్గం. ఇంగ్లాండ్ పై సౌతాఫ్రికా 120 పరుగుల తేడాతో ఓడిపోవాలి. అదే సమయంలో ఆసీస్ జట్టు చివరి మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ పై తక్కువ తక్కువ తేడాతో ఓడిపోయేలా చూసుకోవాలి. 

ఆఫ్ఘనిస్తాన్:

ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ అవకాశాలు ఈ రెండు జట్లకు భిన్నం. ఆఫ్ఘనిస్తాన్ తమ చివరి మ్యాచ్ ఆస్ట్రేలియాతో  శుక్రవారం (ఫిబ్రవరి 28) ఆడాల్సి ఉంది.  ఈ మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్ కు చావో రావో లాంటింది. గెలిస్తేనే సెమీస్ చేరుకుంటుంది. ఓడిపోతే మాత్రం టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన అవసరం లేదు.