ఛాంపియన్స్ ట్రోఫీకి సమయం దగ్గర పడుతోంది. మరో 15 రోజు ఈ ఐసీసీ మెగా ఈవెంట్ షురూ కానుంది. ఫిబ్రవరి 19న పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య కరాచీ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నీలో దాయాది జట్లు భారత్, పాకిస్తాన్ ఫిబ్రవరి 23 (ఆదివారం)న తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం(దుబాయ్) ఆతిథ్యమివ్వనుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి సమయం దగ్గరపడుతుండటంతో ఐసీసీ.. టికెట్ల విక్రయాలు మొదలు పెట్టింది. సోమవారం(ఫిబ్రవరి 03) నుంచి విడతల వారీగా టికెట్ల అందుబాటులోకి రానున్నాయి. మొదట పాక్ ఆతిథ్యమివ్వనున్న 10 మ్యాచ్‌లకు టికెట్ల బుకింగ్ ప్రారంభమైంది. ఆసక్తి గల వారు ఐసీసీ అధికారిక పోర్టల్(https://www.iccchampionstrophy.com/tickets)లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. మరికొన్ని గంటల్లో దుబాయ్ ఆతిథ్యమివ్వనున్న మ్యాచ్‌ల టికెట్లు అందుబాటులోకి రానున్నాయి
ALSO READ | ENG v AUS: ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ 'బాల్ ఆఫ్ ది సెంచరీ'.. షేన్ వార్న్‌ను గుర్తు చేసిందిగా
ఎప్పటిలానే ఈసారి ఇండియా- పాక్ పోరుకు అధిక డిమాండ్ తప్పట్లేదు. ఈ హైవోల్టేజ్ మ్యాచ్ టికెట్లు త్వరగా అమ్ముడయ్యే అవకాశం ఉంది. కావున, ప్రత్యక్షంగా వీక్షించాలనుకున్న వారు వీలైనంత త్వరగా టికెట్లు బుక్ చేసుకోండి.
హైబ్రిడ్ మోడల్.. గమనించగలరు
భారత జట్టు.. పాక్ వెళ్లేందుకు ఇష్టపడక పాలవడంతో.. ఐసీసీ ఈ మెగా టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహిస్తోంది. ఈ విషయాన్ని అభిమానులు గమనించగలరు. భారత జట్టు మ్యాచ్‌లు దుబాయ్ లో జరగనుండగా.. మిగిలిన మ్యాచ్‌లకు పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనుంది. కావున భారత జట్టు మ్యాచ్‌ల టికెట్లు బుక్ చేసుకోవాలనుకున్న వారు దుబాయ్ ఆప్షన్ ఎంచుకోండి.
టికెట్లు బుక్ చేసుకునే విధానం
స్టెప్ 1: https://www.iccchampionstrophy.com/ticketsకి వెళ్లండి
స్టెప్ 2: 'దుబాయ్ హోస్ట్ చేసిన మ్యాచ్‌లు' విభాగాన్ని ఎంచుకోండి.
స్టెప్ 3: మీరు చూడాలనుకుంటున్న మ్యాచ్‌ని ఎంచుకుని, మీరు విదేశీ యాత్రికులైతే మీ పాస్‌పోర్ట్ నంబర్, మీరు కొనాలనుకుంటున్న
టికెట్ల సంఖ్యను ఎంటర్ చేయండి. ఒక వ్యక్తి ఒక్కో మ్యాచ్‌కు గరిష్టంగా నాలుగు టికెట్లు కొనుగోలు చేయవచ్చు.
స్టెప్ 4: మీకు ఇష్టమైన సీట్లను ఎంచుకుని.. మీ కమ్యూనికేషన్ వివరాలను నమోదు చేయండి.
స్టెప్ 5: చివరగా మీకు నచ్చిన చెల్లింపు పద్ధతిలో పేమెంట్ చెల్లించండి. మీరు బుకింగ్ సమయంలో ఎంటర్ చేసిన ఇమెయిల్ IDకి టికెట్లు బుకింగ్ అయినట్లు మెసేజ్ వస్తుంది.
మార్చి 4న తొలి సెమీఫైనల్ ముగిసిన తరువాత ఫైనల్(మార్చి 9) మ్యాచ్ టికెట్లు విడుదల చేస్తామని ఐసీసీ ప్రకటించింది.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు షెడ్యూల్
- ఫిబ్రవరి 20 (గురువారం): ఇండియా vs బంగ్లాదేశ్ (మధ్యాహ్నం 2:30 గంటలకు)
- ఫిబ్రవరి 23 (ఆదివారం): ఇండియా vs పాకిస్తాన్ (మధ్యాహ్నం 2:30 గంటలకు)
- ఆదివారం (మార్చి 2): ఇండియా vs న్యూజిలాండ్ (మధ్యాహ్నం 2:30 గంటలకు)
ఛాంపియన్స్ ట్రోఫీలో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. వీటిని రెండు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్-ఏలో పాకిస్థాన్, భారత్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు.. గ్రూప్-బిలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, అప్ఘానిస్థాన్, ఇంగ్లండ్ జట్లు ఉన్నాయి. ఒక్కో గ్రూపు నుంచి టాప్-2లో నిలిచిన రెండు జట్లు సెమీస్ కు ఆర్హత సాధిస్తాయి.
ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్.
ట్రావెలింగ్ రిజర్వ్స్: వరుణ్ చక్రవర్తి, ఆవేశ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డి