IND vs NZ: ఆదుకున్న అయ్యర్.. న్యూజిలాండ్ ఎదుట మోస్తరు టార్గెట్

IND vs NZ: ఆదుకున్న అయ్యర్.. న్యూజిలాండ్ ఎదుట మోస్తరు టార్గెట్

న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు తడబడ్డారు. కివీస్ ఎదుట ఓ మోస్తరు లక్ష్యాన్ని నిర్ధేశించారు. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 249 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్(79; 98 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్. 

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఆదిలోనే కష్టాల్లో పడింది. కివీస్ పేసర్లు మాట్ హెన్రీ, కైల్ జామిసన్ జోడి నిప్పులు చెరగడంతో 30 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది.  గిల్(2), రోహిత్(15), కోహ్లీ(11) ముగ్గురూ నిరాశ పరిచారు. ఆ సమయంలో అక్షర్‌ పటేల్(42), శ్రేయాస్‌ అయ్యర్‌(79) జోడి నిలకడగా ఆడి జట్టును ఆదుకున్నారు. భారీ పార్ట్‌నర్ షిప్‌తో జట్టు స్కోర్‌ను 150 పరుగులకు చేర్చారు. 

ఆపై కొదిసేపటికే అక్షర్‌ పటేల్, శ్రేయాస్‌ అయ్యర్‌ వెనుదిరగడంతో భారత్‌ మళ్లీ కష్టాల్లో పడింది. దానికి తోడు కెఎల్ రాహుల్(23), రవీంద్ర జడేజా(16) మందకొడిగా బ్యాటింగ్ చేయడం జట్టును బాగా దెబ్బతీసింది. చివరలో హార్దిక్ పాండ్యా(45 బంతుల్లో 45; 4 ఫోర్లు, 2 సిక్స్‍లు) పర్వాలేదనిపించాడు. విలువైన పరుగులు చేసి జట్టు స్కోర్.. 250కి చేరువగా తీసుకొచ్చాడు.

న్యూజిలాండ్ బౌలర్లలో మాట్ హెన్రీ ఒక్కడే 5 వికెట్లు పడగొట్టాడు. శుభ్‌మాన్ గిల్, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా నలుగురూ అతడి బాధితులే. పదునైన పేస్‌కు తోడు బౌన్స్‌తో భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. ఇతర బౌలర్లలో జామిసన్, ఓరూర్క్, సాంట్నర్, రవీంద్ర తలా ఒక వికెట్ తీసుకున్నారు.