
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆఖరి లీగ్ మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. ఆదివారం(మార్చి 2) భారత్-న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దాంతో, టీమిండియా మొదట బ్యాటింగ్ చేయనుంది.
ఈ ఇరు జట్లు ఇప్పటికే సెమీఫైనల్ బెర్తు ఖాయం చేసుకున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు గ్రూప్-ఏలో టాపర్‌గా నిలువనుంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకిది 300వ వన్డే. దాంతో, అందరి కళ్ళు అతడిపైనే ఉన్నాయి.
తుది జట్లు
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మాన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, మహ్మద్ షమీ.
న్యూజిలాండ్: విల్ యంగ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ శాంట్నర్ (కెప్టెన్), మ్యాట్ హెన్రీ, విలియం ఓరూక్, కైల్ జామిసన్.