Champions Trophy 2025: చాంపియన్స్‌ ట్రోఫీ.. పాకిస్తాన్ - బంగ్లాదేశ్ మ్యాచ్ రద్దు

Champions Trophy 2025: చాంపియన్స్‌ ట్రోఫీ.. పాకిస్తాన్ - బంగ్లాదేశ్ మ్యాచ్ రద్దు

చాంపియన్స్‌ ట్రోఫీని ఆతిథ్య పాకిస్తాన్ జట్టు విజయమన్నదే లేకుండా ముగించింది. గురువారం (ఫిబ్రవరి 27) దాయాది జట్టు బంగ్లాదేశ్‌తో తలపడాల్సి ఉండగా.. వర్షం కారణంగా  మ్యాచ్‌ రద్దయ్యింది. దాంతో, 29 ఏళ్ల తర్వాత ఐసీసీ టోర్నీకి ఆతిథ్యమిచ్చిన పాక్.. అవమానకర రీతిలో టోర్నీ నుండి తప్పుకుంది. 

మూడు రోజులుగా వర్షాలు..

గత మూడు రోజులుగా రావల్పిండిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం (ఫిబ్రవరి 25) దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. ఇప్పుడు ఈ ఇరు జట్లది చావో రేవో పరిస్థితి. మళ్లీ ఇప్పుడు బంగ్లాదేశ్, పాకిస్థాన్ మ్యాచ్‌ను తుడిచి పెట్టేసింది. ఈ రెండు మ్యాచ్‌ల్లో కనీసం టాస్ కూడా పడలేదు. మ్యాచ్ రద్దవడంతో ఇరు జట్లకు ఒక్కో పాయింట్ లభించింది. గెలవకుండానే ఒక్కో పాయింట్ చేరడం ఇరు జట్ల అభిమానులను సంతోషపెట్టేదే.

ALSO READ : Champions Trophy: వాళ్లు 1500, మేం 400.. ఇండియా చేతిలో ఓడిపోవడంలో న్యాయముంది: పాక్ హెడ్ కోచ్ 

ప్రారంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో 60 పరుగుల తేడాతో ఓడిన పాక్, అనంతరం దుబాయ్‌లో చిరకాల ప్రత్యర్థి భారత్ చేతిలో 6 వికెట్ల తేడాతో చిత్తయ్యింది. మరోవైపు, ఛాంపియన్స్ ట్రోఫీ తమదేనని ప్రగల్భాలు పలికిన బంగ్లా.. ఇండియా, న్యూజిలాండ్ చేతిలో పరాజయం పాలైంది.