
చాంపియన్స్ ట్రోఫీ 2025లో నేడు(ఫిబ్రవరి 22) కీలక మ్యాచ్ జరుగుతోంది. లాహోర్ వేదికగా బలమైన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు అమీ తుమీ తేల్చుకుంటున్నాయి. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. తొలుత ఫీల్డింగ్ ఎంచుకోగా.. ఇంగ్లీష్ జట్టు బ్యాటింగ్ ఆరంభించింది.
Also Read :- ఇండియాలో 2030 కామన్వెల్త్ గేమ్స్!
సాల్ట్ ఔట్..
బ్యాటింగ్ మొదలుపెట్టిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లీష్ పవర్ హిట్టర్, ఓపెనర్ ఫిల్ సాల్ట్ (10) రెండో ఓవర్‌లోనే వెనుదిరిగాడు. మిడ్-ఆన్‌లో క్యారీ అద్భుతమైన క్యాచ్ అందుకొని సాల్ట్‌కు షాకిచ్చాడు. 2 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్.. 17/1.
A STUNNER FROM FLYING ALEX CAREY. 🥶 pic.twitter.com/Qkaan8iTaC
— Johns. (@CricCrazyJohns) February 22, 2025
తుది జట్లు:
ఇంగ్లండ్: ఫిల్ సాల్ట్, బెన్ డకెట్, జేమీ స్మిత్ (వికెట్ కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్), లియామ్ లివింగ్ స్టోన్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, అదిల్ రషీద్, మార్క్ వుడ్.
ఆస్ట్రేలియా: మ్యాథ్యూ షార్ట్, ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), అలెక్స్ కేరీ, గ్లెన్ మాక్స్‌వెల్, బెన్ డ్వారిషూస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, స్పెన్సర్ జాన్సన్.