ODI World Cup 2023: ప్రమాదంలో ఇంగ్లాండ్ జట్టు.. మరో రెండు ఓడితే ఐసీసీ టోర్నీకి దూరం

డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన ఇంగ్లాండ్ వరల్డ్ కప్ లో ప్లాప్ షో కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. టైటిల్ ఫేవరేట్ గా దిగిన బట్లర్ సేన అంచనాలను అందుకోలేకపోగా కనీస ప్రదర్శన కూడా చేయడం లేదు. చిన్న జట్ల మీద కూడా ఓడిపోతూ విమర్శలు మూట కట్టుకుంటుంది. ఆడిన 5 మ్యాచ్ ల్లో నాలుగు ఓటములను చవిచూసిన ఇంగ్లాండ్ జట్టుకు కొత్త టెన్షన్ పట్టుకుంది. 

2025 ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యే అవకావడం కనిపిస్తుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పదవ స్థానంలో ఉన్న ఇంగ్లాండ్.. లీగ్ మ్యాచు లన్ని ముగిసేసరికి టాప్ సెవన్ లో లేకపోతే పాకిస్థాన్ లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమవుతుంది. ఐసీసీ ర్యాంకింగ్స్ లో టాప్ 8 లో ఉన్న జట్లు ఈ టోర్నీ ఆడతాయి. ఈ మెగా టోర్నీ పాకిస్థాన్ లో నిర్వహిస్తుండగా ఆతిధ్య జట్టుగా నేరుగా అర్హత సాధిస్తుంది. ఈ లెక్కల ప్రకారం చూసుకుంటే ఇంగ్లాండ్ వారు తర్వాత ఆడబోయే నాలుగు మ్యాచ్ ల్లో రెండు ఓడిపోయినా ఛాంపియన్స్ ట్రోఫీపై వీరు ఆశలు వదులుకోవాల్సిందే. 

ALSO READ:- ODI World Cup 2023: కోహ్లీపై పొగడ్తలు.. అతని కంటే రోహిత్ గొప్పవాడన్న గంభీర్

బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక జట్లు ఇంగ్లాండ్ కు గట్టి పోటీనిస్తున్నాయి. భారత్, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, సౌత్ ఆఫ్రికా సెమీస్ చేరడం దాదాపుగా ఖాయమైంది. పాకిస్థాన్ ఆతిధ్య దేశం కాబట్టి ఆజట్టును వదిలేసినా.. ఆ తర్వాత మూడు స్థానాల కోసం బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, నెదర్లాండ్స్, ఇంగ్లాండ్ మధ్య పోటీ తప్పేలా లేదు. ఇంగ్లాండ్ తన తదుపరి నాలుగు మ్యాచ్ లు ఇండియా, ఆస్ట్రేలియా, శ్రీలంక, నెదర్లాండ్స్ తో ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో లీగ్ మ్యాచ్ లో ముగిసేసరికి ఇంగ్లాండ్ ఏ స్థానంలో ఉంటుందో చూడాలి.           

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by CricTracker (@crictracker)