- ఫిబ్రవరి 19 నుంచి చాంపియన్స్ ట్రోఫీ
- ఇండియా మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లోనే
కరాచీ : పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనున్న చాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19వ తేదీ నుంచి హైబ్రిడ్ మోడల్‌లో జరగనుంది. టోర్నీ షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం ప్రకటించింది. దాయాది జట్లు ఇండియా–పాకిస్తాన్ మెగా మ్యాచ్ ఫిబ్రవరి 23న దుబాయ్‌లో జరగనుంది. ఈ టోర్నీలో ఇండియా ఆడే మ్యాచ్‌లు దుబాయ్‌లో నిర్వహిస్తారు. మిగతా మ్యాచ్‌లకు లాహోర్, రావల్పిండి, కరాచీ ఆతిథ్యం ఇస్తాయి. ఇండియా గ్రూప్–ఎలో పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌తో కలిసి బరిలోకి దిగనుంది. ఫిబ్రవరి 20న బంగ్లాతో, 23న పాక్‌తో, మార్చి 2న న్యూజిలాండ్‌తో పోటీపడుతుంది.
గ్రూప్–బిలో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, అఫ్గానిస్తాన్, ఇంగ్లండ్ ఉన్నాయి. గ్రూప్ దశలో టాప్–2లో నిలిచిన జట్లు సెమీస్ చేరుకుంటాయి. ఇండియా సెమీస్‌కు క్వాలిఫై అయితే దుబాయ్‌లో తొలి సెమీస్‌లో పాల్గొంటుంది. పాక్ నాకౌట్ చేరితే రెండో సెమీస్‌లో బరిలోకి దిగుతుందని ఐసీసీ తెలిపింది. ఇండియా ఫైనల్ (మార్చి 9) కు క్వాలిఫై అయితే దుబాయ్‌లోనే తలపడుతుంది. లేదంటే లాహోర్‌లో ఫైనల్ ఉంటుంది.
చాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్
తేదీ మ్యాచ్ వేదిక
ఫిబ్రవరి 19 పాకిస్తాన్ x న్యూజిలాండ్ కరాచీ
20 బంగ్లాదేశ్ x ఇండియా దుబాయ్
21 అఫ్గానిస్తాన్ x సౌతాఫ్రికా కరాచీ
22 ఆస్ట్రేలియా x ఇంగ్లండ్ లాహోర్
23 పాకిస్తాన్ x ఇండియా దుబాయ్
24 బంగ్లాదేశ్ x న్యూజిలాండ్ రావల్పిండి
25 ఆస్ట్రేలియా x సౌతాఫ్రికా రావల్పిండి
26 అఫ్గానిస్తాన్ x ఇంగ్లండ్ లాహోర్
27 పాకిస్తాన్ x బంగ్లాదేశ్ రావల్పిండి
28 అఫ్గానిస్తాన్ x ఆస్ట్రేలియా లాహోర్
మార్చి1 సౌతాఫ్రికా x ఇంగ్లండ్ కరాచీ
2 న్యూజిలాండ్ x ఇండియా దుబాయ్
4 తొలి సెమీ ఫైనల్ దుబాయ్
5 రెండో సెమీ ఫైనల్ లాహోర్
9 ఫైనల్ లాహోర్
(ఇండియా అర్హత సాధిస్తే ఫైనల్ దుబాయ్‌లో)