IND vs AUS: ట్రావిస్ హెడ్ కౌంటర్ అటాక్.. షమీ బౌలింగ్‌లో హ్యాట్రిక్ ఫోర్లు

IND vs AUS: ట్రావిస్ హెడ్ కౌంటర్ అటాక్.. షమీ బౌలింగ్‌లో హ్యాట్రిక్ ఫోర్లు

4 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్‌ను ట్రావిస్ హెడ్ (26 బంతుల్లో 33 నాటౌట్; 5 ఫోర్లు, ఒక సిక్స్) గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. కౌంటర్ అటాక్‌తో భారత్‌పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. 

హార్దిక్ పాండ్యా వేసిన నాలుగో ఓవర్‌లో ఫోర్‌, సిక్స్ బాదిన హెడ్‌.. షమీ వేసిన ఐదవ నాలుగో ఓవర్‌లో హ్యాట్రిక్ ఫోర్లు రాబట్టాడు. మూడు, నాలుగు, ఐదు బంతులను వరుసగా బౌండరీకి తరలించాడు. ఆ తరువాత అదే దూకుడు. దాంతో, ఆసీస్‌ స్కోర్‌ 7 ఓవర్లకు47/1కు చేరింది. 

ట్రావిస్ హెడ్‌ను వీలైనంత త్వరగా పెవిలియన్ చేర్చాలి. అతన్ని క్రీజులో కుదురుకొనిచ్చారంటే.. భారత జట్టుకు కష్టాలు తప్పవు. ఈ విషయాన్ని గ్రహించిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ.. కుల్దీప్‌ను ఆరో ఓవర్ లోనే దించాడు. ప్రస్తుతం హెడ్(33 నాటౌట్). స్టీవ్ స్మిత్(8 నాటౌట్) క్రీజులో ఉన్నారు.

Also Read :  తొలి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా

అంతకుముందు మాథ్యూ షార్ట్ స్థానంలో జట్టులోకి వచ్చిన కూప‌ర్ కాన‌ల్లీ(0) డకౌట్ అయ్యాడు. తొమ్మిది బంతులు ఎదుర్కొన్న కాన‌ల్లీ ఖాతా తేవరకుండానే పెవిలియన్ చేరాడు. షమీ ఓ చక్కని బంతితో అతన్ని బోల్తా కొట్టించాడు. దాంతో, ఆసీస్ 4 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది.