
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా న్యూజిలాండ్‌తో జరుగుతోన్న ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య పాక్ ఎదురీదుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ 320 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో పాక్ పవర్ ప్లే ముగిసేసరికి 2 వికెట్లు నష్టపోయి 22 పరుగులు చేసింది. ఇదంతా బాగానే ఉన్నా.. ఇక్కడ ఓ విషయం అందరినీ అయోమయానికి గురి చేస్తోంది. పాకిస్థాన్ రెగ్యులర్ ఓపెనర్ ఫఖర్ జమాన్ ఎందుకు ఓపెనర్‌గా రాలేదన్నది అసలు ప్రశ్న.
అసలేం జరిగిందంటే..?
ఆట ప్రారంభమైన రెండో బంతికే ఫీల్డింగ్ చేస్తూ ఫకర్ జమాన్ గాయపడ్డాడు. దాంతో, అతడు మైదానాన్ని వీడాడు. అలా పోయినోడు మరో రెండు ఓవర్లలో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ముగుస్తుంది అనంగా మైదానంలోకి వచ్చాడు. దాంతో ఓపెనింగ్ చేయడానికి అంపైర్లు అతన్ని అనుమతించలేదు.
Also Read :- లాథమ్, విల్ యంగ్ సెంచరీలు
ఐసీసీ నిబంధన 24.2.3.2 ప్రకారం, ఒక ఆటగాడు 15 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువ సేపు మైదానాన్ని వీడితే, నిర్దిష్ట సమయాన్ని పెనాల్టీగా విధిస్తారు. అది పూర్తయ్యాక లేదా అతని జట్టు 5 వికెట్లు కోల్పోయాక బ్యాటింగ్ చేయడానికి అనుమతిస్తారు. ఈ మ్యాచ్‌లో ఫఖర్ 15 నిమిషాలు కంటే ఎక్కువ సమయం దూరంగా ఉన్నాడు కనుక పాకిస్తాన్ ఇన్నింగ్స్ ప్రారంభమైన 25 నిమిషాలు తరువాత బ్యాటింగ్ చేయొచ్చు. లేదా దాయాది జట్టు ఆ సమయంలోపు 5 వికెట్లు కోల్పోయినా బ్యాటింగ్‌కు రావొచ్చు.
టార్గెట్.. 321
అంతకుముందు న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 314 పరుగుల భారీ స్కోర్ చేసింది. విల్ యంగ్(107), టామ్ లాథమ్(107) సెంచరీలు చేయగా.. చివరలో గ్లెన్ ఫిలిప్స్(35 బంతుల్లో 107; 12 ఫోర్లు, ఒక సిక్స్‌లు) మెరుపు అర్ధ శతకం బాదాడు.