వీడియో: గ్లెన్ ఫిలిప్స్ స్టన్నింగ్ క్యాచ్‌.. తల పట్టుకున్న అనుష్క శ‌ర్మ

వీడియో: గ్లెన్ ఫిలిప్స్ స్టన్నింగ్ క్యాచ్‌.. తల పట్టుకున్న అనుష్క శ‌ర్మ

కెరీర్‌లో 300వ వ‌న్డే ఆడుతున్న విరాట్ కోహ్లీ పూర్తిగా నిరాశ పరిచాడు. పాకిస్తాన్‌పై శతకం బాది మంచి ఊపుమీదున్న భారత స్టార్ మరో సెంచరీ చేస్తాడనుకుంటే..11 పరుగులకే ఔటయ్యాడు. ఆ క్రెడిట్ అంతా కివీస్ ఫీల్డర్ గ్లెన్ ఫిలిప్స్‌ది. అతడు అందుకున్న క్యాచ్ అటువంటిది. 

 నిజానికి కోహ్లీ ఆడింది.. మంచి షాట్. బ్యాక్‌వ‌ర్డ్ పాయింట్ దిశ‌గా చ‌క్కని షాట్ ఆడాడు. గ్లెన్ ఫిలిప్స్ స్థానంలో మరొకరు ఎవరున్నా నాలుగు పరుగులు కోహ్లీ ఖాతాలో చేరేవి. కానీ, ఫిలిప్స్ దెబ్బకొట్టాడు. తన విన్యాసంతో స్పైడర్ మ్యాన్‌ను గుర్తు చేశాడు. సెకన్ల వ్యవధిలో మెరుపు వేగంతో రియాక్ట్ అయ్యాడు. క్షణాల్లో కుడి చేతి వైపు డైవ్ చేస్తూ గాల్లోనే బంతిని ఒడిసి ప‌ట్టుకున్నాడు. దాంతో, కోహ్లీ, అతని సతీమణి అనుష్క శర్మతో పాటు అభిమానులు సైతం షాక్ తిన్నారు.

100 దాటిన టీమ్ఇండియా స్కోరు

30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియాను అక్షర్ పటేల్(28 నాటౌట్), శ్రేయస్ అయ్యర్(46 నాటౌట్) జోడీ గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. వీరిద్దరూ ఇప్పటివరకు 77 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రస్తుతం టీమిండియా స్కోర్.. 25 ఓవర్లు ముగిసేసరికి 104/3.