![Champions Trophy: ఆడతాడా..? లేదా..?: రేపే(ఫిబ్రవరి 11) బుమ్రాపై తుది నిర్ణయం](https://static.v6velugu.com/uploads/2025/02/champions-trophy-bcci-takes-final-decision-regarding-jasprit-bumrah-on-february-11-report_UasJthSmV4.jpg)
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి సమయం దగ్గర పడుతోంది. ఫిబ్రవరి 19న ఆతిథ్య పాక్ - న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌తో టోర్నీ షురూ కానుంది. ఇప్పటికే ప్రకటించిన స్క్వాడ్‌లలో మార్పులు చేసుకొనేందుకు ఆయా జట్లకు అధికారికంగా ఇంకా మూడు రోజులే గడువు. అయినప్పటికీ, భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా విషయంలో బీసీసీఐ ఓ అంచనాకు రాలేకపోతోంది. ఈ విషయంలో బీసీసీఐ మంగళవారం ఫైనల్ డిసిషన్ తీసుకోనుందని నివేదికలు చెప్తున్నాయి.
ఆసీస్ పర్యటన చివరలో గాయం..
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ చివరలో బుమ్రా వెన్ను నొప్పితో బాధపడ్డాడు. ఆనాటి నుంచి ఆటకు దూరం. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ కు ఎంపిక చేసినప్పటికీ, బరిలోకి దిగింది లేదు. పోనీ, ఛాంపియన్స్ ట్రోఫీలో అయినా ఆడేనా..! అంటే అది సందేహమే. బుమ్రా వెన్ను గాయాన్ని అంచనా వేసేందుకు ఇటీవల స్కాన్లు తీశారు. అందులో ఫలితాలు సానుకూలంగా లేవు. ఒకవేళ మంచి ఫలితాలు ఉండుంటే.. ఈపాటికి ప్రకటన వచ్చేది.
Also Read :- చరిత్ర సృష్టించిన కేన్ ‘మామ’
బుమ్రా స్కాన్ రిపోర్టులను బీసీసీఐ మెడికల్ స్టాఫ్ పరీక్షిస్తోంది. ఏంటనే దానిపై సెలక్టర్లు, టీమ్ మేనేజ్ మెంట్‌తో కో ఆర్డినేట్ చేస్తోంది. ఆ రిపోర్టులను బట్టి బుమ్రాపై మంగళవారం(ఫిబ్రవరి 11) తుది నిర్ణయం తీసుకోబోతున్నారు. ఒకవేళ స్పీడ్ గన్ ఛాంపియన్స్ ట్రోఫీకి అనర్హుడని తేలితే, హర్షిత్ రాణా జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. ఈ యువ పేసర్ ఈ నెలలో ఇంగ్లాండ్‌పై ఇప్పటికే రెండు వన్డేలు ఆడాడు.
ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైశ్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్.