
లాహోర్: వచ్చే ఏడాది జరిగే చాంపియన్స్ ట్రోఫీ వేదికలను ఆతిథ్య పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రకటించింది. కరాచీ, లాహోర్, రావల్పిండి నగరాల్లో మ్యాచ్‌లు జరుగుతాయని సోమవారం తెలిపింది. ఓవైపు టీమిండియా పోటీ పడే విషయంపై సస్పెన్స్, మరోవైపు హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహిస్తారన్న ప్రచారం నడుమ పీసీబీ వేదికలు ఖరారు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. చివరగా 2017లో ఇంగ్లండ్‌లో ఈ టోర్నీని నిర్వహించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి–మార్చిలో తదుపరి ఎడిషన్ జరిగే అవకాశం ఉంది. కానీ, పాక్‌లో ఆడేందుకు టీమిండియాను కేంద్ర ప్రభుత్వం అనుమతించడం లేదు. ఈ నేపథ్యంలో ఆసియా కప్ మాదిరిగా ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహిస్తే ఇండియా పోటీ పడొచ్చు.