![చాంపియన్స్ ట్రోఫీ విన్నర్‌కు రూ. 19.40 కోట్లు](https://static.v6velugu.com/uploads/2025/02/champions-trophy-prize-money-icc-unveil-bumper-rs-1945-crore-package-for-winners_6R0NGByqze.jpg)
దుబాయ్: పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచే జట్టు రూ. 19.40 కోట్ల(2.24 మిలియన్ యూఎస్ డాలర్లు) భారీ ప్రైజ్‌మనీ సొంతం చేసుకోనుంది. ఎనిమిది జట్లు పోటీ పడుతున్న ఈ మెగా ఈవెంట్‌కు ఇచ్చే క్యాష్ రివార్డును ఐసీసీ శుక్రవారం ప్రకటించింది. ఈ నెల 19 నుంచి జరిగే టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీని రూ. 60 కోట్లకు (6.9 మిలియన్ డాలర్లు) పెంచింది.
రన్నరప్‌గా నిలిచే జట్టు రూ. 9.72 కోట్లు (1.12 మిలియన్ డాలర్లు) అందుకోనుండగా.. సెమీఫైనల్లో ఓడిన జట్లకు ఒక్కోదానికి రూ. 4.86 కోట్లు (560,000 డాలర్లు) లభిస్తాయి. టోర్నీలో పాల్గొంటున్నందుకు గాను ఎనిమిది జట్లకు రూ. 1.08 కోట్లు లభిస్తాయి. గ్రూప్ స్టేజీలో ఒక్కో విజయానికి అదనంగా రూ. 30 లక్షలు అందుకుంటాయి. 5,6 స్థానాల్లో నిలిచే జట్లకు రూ. 3 కోట్లు, 7,8వ స్థానాల్లో టోర్నీని ముగించే జట్లకు రూ. 1.2 కోట్ల చొప్పున కేటాయిస్తున్నట్టు ఐసీసీ తెలిపింది.