
న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు తడబడుతున్నారు. కివీస్ పేసర్లు మాట్ హెన్రీ(2 వికెట్లు), కైల్ జామిసన్( ఒక వికెట్) జోడి నిప్పులు చెరుగుతుండటంతో పెవిలియన్‍కు క్యూ కడుతున్నారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 30 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. గిల్(2), రోహిత్(15), కోహ్లీ(11) ముగ్గురూ ఔటయ్యారు.
గిల్ LBW..
15 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. మ్యాట్ హెన్రీ బౌలింగ్‌లో మూడో ఓవర్ నాలుగో బంతికి గిల్(2) ఎల్బీడబ్ల్యూగా దొరికిపోయాడు. డీఆర్‌ఎస్ తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది. సమీక్షలోనూ ఔట్‌గా తేలడంతో పెవిలియన్ బాట పట్టాడు. ఆపై కొద్దిసేపటికే రోహిత్(15) సైతం ఔటయ్యాడు. దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించి మిడ్-వికెట్‌లో విల్‌యంగ్ చేతికి చిక్కాడు. దాంతో, 22 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది.
స్పైడర్ మ్యాన్ ఫిలిప్స్..
కెరీర్‌లో 300వ వన్డే ఆడుతున్న విరాట్ కోహ్లీ (11)అభిమానులను నిరాశ పరిచాడు. స్వల్ప స్కోరుకే ఔటయ్యాడు. బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో గ్లెన్ ఫిలిప్స్ స్పైడర్ మ్యాన్‌లా క్యాచ్ ఒడిసి పట్టుపోవడంతో .. భారత స్టార్ నిరాశతో పెవిలియన్ బాట పట్టాడు. ప్రస్తుతం టీమిండియా స్కోరు.. 7 ఓవర్లు ముగిసేసరికి 30/3. క్రీజులో శ్రేయస్(1 నాటౌట్), అక్షర్ పటేల్(0 నాటౌట్) ఉన్నారు. వీరిద్దరూ మంచి పార్టనర్‌షిప్ నెలకొల్పితే టీమిండియా గట్టెక్కినట్టే.