
హైదరాబాద్, వెలుగు: ఏఐసీసీ మాజీ చీఫ్ సోనియా గాంధీని నకిలీ గాంధీ అన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై పీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ ఫైర్ అయ్యారు. శుక్రవారం గాంధీ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. సోనియాను విమర్శించే స్థాయి బండి సంజయ్‌కి లేదన్నారు. ఆ తల్లి తెలంగాణ ఇవ్వడం వల్లే ఈ రాష్ట్రం నుంచి సంజయ్ కేంద్ర మంత్రి అయ్యాడనే విషయం మర్చిపోకూడదని సూచించారు.
గాంధీ కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేకపోతే కాంగ్రెస్ క్యాడర్ నుంచి తీవ్ర నిరసనలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. గాంధీ కుటుంబంపై బీజేపీకి ఎంతటి ద్వేషం ఉందో బండి సంజయ్ వ్యాఖ్యలతో మరోసారి రుజువైందని అన్నారు.