
ఆచార్య చాణక్యుడు తన తెలివితేటలు ... పాండిత్యం తో శక్తివంతమైన సామ్రాజ్యాన్ని స్థాపించడంలో కీలక పాత్ర పోషించాడు. ఆయనకు రాజకీయాలతో పాటు ఇతర అంశాలపై పట్టు ఉండేది. చాణక్య నీతిలో అనేక అంశాలు ఉన్నాయి. చాణక్య నీతి నాల్గవ అధ్యాయంలో మంచిగా జీవించాలంటే మానవుడు ఏమేమి త్యాగం చేయాలో వివరించారు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. .
ఆచార్య చాణక్య గొప్ప తన నీతి శాస్త్రంలో జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలను ఎలా ఎదుర్కోవాలో తెలియజేశారు. చాణక్య తెలిపిన జీవన విధానాలను అవలంబించడం ద్వారా ఎవరైనాసరే తమ జీవితాన్ని సరళంగా తేలికగా మార్చుకోగలుగుతారు. అందుకే చాణక్య అందించిన నీతి సూత్రాలు నేటికీ అనుసరణీయంగా ఉన్నాయి. చాణక్య తెలిపిన విధానాలు కొంతవరకూ కఠినంగా అనిపించినప్పటికీ వీటిని జీవితంలో అమలుచేస్తే సంతోషకరమైన జీవితాన్ని అందుకోవచ్చు. జీవితంలో విజయం సాధించాలంటే ఎటువంటి లక్షణాలు కలిగివుండాలో ఆచార్య చాణక్యుడు తెలియజేశారు.
త్యజేద్ధర్మ దయాహీనాం విద్యాహీనాం గురు త్యజేత ।
త్యజేత్క్రోధముఖీ భార్యా నిఃస్నేహన్బన్ధ్వంస్యజేత్॥
ఈ శ్లోకం ప్రకారం, మతంలో కరుణ లేకపోతే .. గురువుకు జ్ఞానం లేకపోతే.. అటువంటి వారిని విడిచిపెట్టడం సముచితం. ఈ శ్లోకం కోపంగా ఉన్న స్త్రీని మరియు అనురాగం లేని బంధువులను కూడా వదిలివేయాలని చెబుతుంది. ఆచార్య చాణక్యుడు త్యాగం ప్రాముఖ్యతను వివరించాడు. మానవుడు తన జీవితంలో కొన్ని విషయాలను వదులుకోవడం మంచిది. అలా వదులుకోకపోతే అవి హాని మాత్రమే కలుగజేస్తాయని చాణక్యుడు నాల్గవ అధ్యాయంలో వివరించారు. చాణక్య నీతిలో విద్య ఎంతముఖ్యమో వివరించారు.
చాణక్య నీతి ప్రకారం..గురువు పాత్ర గురించి వివరిస్తూ.. జ్ఞానం లేని గురువును వదిలివేయాలని, లేకుంటే నష్టం కలుగుతుందని చాణక్యడు వివరించాడు. గురువుతో గొడవలు వద్దు. ప్రతి ఒక్కరి జీవితంలో ఉపాధ్యాయుడి పాత్ర కీలకం. ఒక మంచి ఉపాధ్యాయుడు వ్యక్తి జీవితంలో మార్గదర్శి అవుతారు. అయితే కొందరు మాత్రం కోపంతో గురుదేవుడుని కించ పరిచేలా మాట్లాడుతూ వారి గురించి చెడుగా మాట్లాడానికి కూడా వెనుకాడరు. ఇలా చేయడం ద్వారా మీరు గురువును మాత్రమే కాదు జ్ఞానానికి కూడా దూరం అవుతారు.
కో పం విషయంలో ...కోపానికి దూరంగా ఉండాలి. కోపం వ్యక్తిని నాశనం చేస్తుంది . అతని జీవితంలో ఆనందం .. శాంతి లేకుండా చేస్తుంది . కోపం మనిషిలోని ఒక స్వభావం. స్త్రీ, పురుషులు, చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ కోపం వస్తుంది. అయితే చాలా సార్లు కోపం సమయం సందర్భంలో పని లేకుండా అనుకోకుండా వస్తుంది. అలా అదుపు లేకుండా వచ్చే కోపం వలన అనర్ధం కలుగుతుందని చాణుక్యుడు చెబుతున్నారు. అంతేకాదు కోపంలో అవతలి వ్యక్తి ఎవరనేది పట్టించుకోకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడానికి కూడా మనిషి వెనుకాడడు. కొంచెం సేపటి తర్వాత కోపం అదుపులోకి వచ్చాక. అయ్యో నేను అలా అనకుండా ఉండాల్సింది. లేకపోతే అలా చేయకుండా ఉండాల్సింది అంటూ చింతిస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఆచార్య చాణక్యుడి విధానాలను ఆచరించడం ఉత్తమ మార్గమని పెద్దలు చెప్పారు. చాణక్య విధానం ప్రకారం ఎంత కోపం వచ్చినా కొంతమందితో ఎప్పుడూ గొడవ పడకండి. లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది.
ప్రతి వ్యక్తి కుటుంబ సభ్యులకు.. బంధువులకు ఎంతో ప్రాధాన్యత ఇస్తాడు. బంధువులు మిమ్మలను ప్రేమించకపోతే చాణక్యుడు తెలిపిన నీతి సూత్రాల ప్రకారం వారికి దూరంగా ఉండండి. వారితో స్నేహాన్ని తగ్గించుకోవడం చాలా మంచిదని చెప్పారు. ఇక కుటుంబ సభ్యుల విషయంలో .. వారితో గొడవ పడకండి. చాణక్య విధానం ప్రకారం మన కుటుంబ సభ్యులపై ప్రతి చిన్న విషయానికి కోపాన్ని చూపించకూడదు. మీ మంచి చెడులను అర్థం చేసుకునేది అవసరానికి అండగా ఉండేది కుటుంబమే. అటువంటి పరిస్థితిలో కుటుంబ సభ్యులతో గొడవ పడటం మీ శ్రేయోభిలాషులను కోల్పోవడంతో ఇబ్బందులు పడతారు. ఒకొక్కసారి మీరు పశ్చాత్తాపడే పరిస్థితులు రావచ్చు .. అంతే కాక భవిష్యత్తులో మీకు సరైన మార్గాన్ని చూపే కుటుంబ సభ్యులు కూడా దూరం అయ్యే అవకాశం ఉంది.
చాణక్య నీతి ప్రకారం ప్రతి వ్యక్తి జీవితంలో లక్ష్యాన్ని కలిగి ఉండాలి. దీని వలన ఏకాగ్రత.. ప్రేరణ ఉంటాయి. సహనం కోల్పోకుండా ఉండటంతో శత్రువులు పడతారు. మిమ్మల్ని ప్రోత్సహించి.. మీకు అండగా ఉండే వ్యక్తులతో స్నేహం చేయడం చాలా మంచిది. ఒకే విధమైన విలువలు, లక్ష్యాలను పంచుకునే వ్యక్తులతో పరిచయం మంచిదని చాణక్యనీతి ద్వారా తెలుస్తోంది.