దుబ్బాకలో బీజేపీదే గెలుపన్న ‘చాణక్య’ సర్వే

దుబ్బాకలో బీజేపీదే గెలుపన్న ‘చాణక్య’ సర్వే

హోరాహోరీ తప్పదన్న ‘ఆరా’

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన దుబ్బాక ఉప ఎన్నికలపై ఎగ్జిట్‌‌‌‌ పోల్స్‌‌‌‌ ఆసక్తికర అంచనాలను ప్రకటించాయి. బీహార్‌‌‌‌లో శనివారం తుది విడత ఎన్నికలు పూర్తవడంతో పలు సంస్థలు ఈ ఎగ్జిట్‌‌‌‌ పోల్స్‌‌‌‌ను వెల్లడించాయి. వాటితో పాటు దుబ్బాక బైపోల్‌‌‌‌ సర్వేను బయట పెట్టాయి. మిషన్‌‌‌‌ చాణక్య సంస్థ బీజేపీ, టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ మధ్య 6.53 శాతం ఓట్ల తేడా ఉంటుందని అంచనా వేసింది. బీజేపీకి 47.01 శాతం, టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు 40.48 శాతం, కాంగ్రెస్‌‌‌‌కు 12.15 శాతం ఓట్లు పోలయ్యాయని తెలిపింది. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌‌‌‌రావుకు 75,939 ఓట్లు, టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ అభ్యర్థి సోలిపేట సుజాతకు 66,150 ఓట్లు, కాంగ్రెస్‌‌‌‌ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌‌‌‌రెడ్డికి 19,193 ఓట్లు వస్తాయని ఆ సంస్థ వెల్లడించింది. మొత్తం ఏడు మండలాలకుగాను ఒక్క రాయపోలు మండలంలోనే టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు కొద్దిగా మెజార్టీ వస్తుందని, మిగిలిన ఆరు మండలాల్లోనూ బీజేపీదే ఆధిక్యమని తేల్చింది. మరో సర్వే ఏజెన్సీ ‘ఆరా’  మాత్రం దుబ్బాకలో హోరాహోరీ పోరు తప్పదని పేర్కొంది. టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు 48.72 శాతం, బీజేపీకి 44.64 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. రెండు పార్టీలకు 3 శాతం ఓట్లు అదనంగా వచ్చే అవకాశముందని, లేదంటే 3 శాతం ఓట్లను కోల్పోవచ్చని పేర్కొంది. ఈ లెక్కన చూసినా రెండు పార్టీల మధ్య కేవలం ఒక్క శాతం ఓట్ల వ్యత్యాసమే ఉంటుందని, హోరాహోరీ పోరు తెలిపింది. కాంగ్రెస్‌‌‌‌కు 6.12 శాతం, ఇతరులకు 2.52 శాతం ఓట్లు వస్తాయని ఈ సంస్థ అంచనా వేసింది.

For More News..

మన హైదరాబాద్.. మన బీజేపీ