హైదరాబాద్, వెలుగు: 2020–21 ఏడాదికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, ఫిజికల్లీ చాలెంజ్‌డ్ స్టూడెంట్లకు ఫ్రెష్, రెన్యూవల్ స్కాలర్‌షిప్ రిజిస్ట్రేషన్ల కోసం గడువు పెంచినట్టు ఎస్సీ డెవలప్మెంట్డిపార్ట్మెంట్ సెక్రటరీ రాహుల్ బొజ్జా తెలిపారు. అప్లికేషన్లకు సంబంధించి మార్చి 31వ తేదీ వరకు ఈ-పాస్ వెబ్‌సైట్ అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. నిజానికి గతేడాది అక్టోబర్ 14 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభించగా సోమవారంతో గడువు ముగియాల్సి ఉందని.. కానీ పొడిగించామని తెలిపారు. ఇప్పటి దాకా ఫ్రెష్, రెన్యూవల్ కలిపి మొత్తంగా 5 లక్షల 11 వేల 163 మంది స్టూడెంట్లు స్కాలర్‌షిప్ కోసం రిజిస్టర్ చేసుకున్నారని తెలిపారు. అనేక సెట్స్ అడ్మిషన్స్ ఇంకా పూర్తి కాలేదని, ఈ నేపథ్యంలో గడువు పెంచామని వివరించారు.
For More News..